న్యూఢిల్లీ: ఉదయం 11.00 గంటలకు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలోని సభ్యులు తమ ప్రతిపాదించిన అంశాలపై చర్చ జరగాలంటూ పట్టుబట్టారు. దాంతో విపక్ష ఎంపీల తీరుపై స్పీకర్ ఓంబిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అన్ని అంశాలపై చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాలకు విపక్షాలు సహకరించాలని సూచించారు. కానీ ముందు సమస్యలపై చర్చ జరగాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి.