టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తన భార్య శివోన్ జిలిస్ సగం భారతీయురాలని చెప్పారు. శివోన్ జిలిస్‌కు తనకు పుట్టిన కొడుకులలో ఒకరికి శేఖర్ అనే పేరు పెట్టామని, ఇది భారతీయ-అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ గుర్తుగా పేరు పెట్టినట్లు మస్క్ తెలిపారు. నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో మస్క్ టాలెంట్ ఉన్న భారతీయుల వల్ల అమెరికా ప్రయోజనం పొందిందని, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తోందన్నారు.