మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
NEWS Dec 01,2025 11:41 am
బంగారం, వెండి ధరల పెరుగుదల కొనసాగుతోంది. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.660 పెరిగి రూ.1,30,480కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.600 ఎగబాకి రూ.1,19,600 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.4,000 పెరిగి రూ.1,96000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.