రాజాం గ్రామ YCP అధ్యక్షుడిగా మరిశా
NEWS Dec 01,2025 11:43 am
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామానికి చెందిన మరిశా మహారాజు వైయస్సార్సీపి గ్రామ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన కృషిని గుర్తించిన పార్టీ నాయకత్వం ఈ బాధ్యత అప్పగించింది. ఈ సందర్భంగా మహారాజు పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. నియామక వేడుకలో గ్రామ సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.