సౌతాఫ్రికాపై మ్యాచ్‌లో రోహిత్ శర్మ న్యూరికార్డు
NEWS Nov 30,2025 04:47 pm
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును అందుకున్నారు. ఈ మ్యాచ్‌లో 3 సిక్సర్లు బాదిన రోహిత్, వన్డేల్లో అత్యధిక సిక్సర్ల (352 సిక్సులు – 269 ఇన్నింగ్స్) సాధకుడిగా అగ్రస్థానానికి చేరుకున్నారు. ఆయనను పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రీది (351 సిక్సులు – 369 ఇన్నింగ్స్), వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ (331 సిక్సులు – 294 ఇన్నింగ్స్) అనుసరిస్తున్నారు. భారత క్రికెట్‌లో 'హిట్‌మ్యాన్' దూకుడు మరోసారి రికార్డులను తిరగరాశాడు.