ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద ఆన్నదానం
NEWS Nov 30,2025 10:51 am
హైదరాబాద్: ఆకలితో అల్లాడుతున్న వారికి, ఆసు పత్రిలో రోగులకు సహాయకులుగా వచ్చిన వారికి అండగా నిలుస్తూ 'రెడీ టు సర్వ్' ఫౌండేషన్ నిర్వాహకులు పెద్ది శంకర్ ఆధ్వర్యంలో నిలోఫర్, MNJ ఆస్పత్రుల వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రుల వద్దకు వచ్చిన 300 మందికి పైగా పేదలకు, రోగుల సహాయకులకు భోజనం అందించారు. యాంకర్ అంజలి, ఆర్‌జే రాజు, నటుడు విజయ భాస్కర్, శ్రీదేవి తదిత -రులు పాల్గొని పేదలకు అన్నం వడ్డించారు.