ప్రధాని మోదీ 128 వ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కరీంనగర్‌లో ఉత్పత్తి చేసిన సాంప్రదాయ కళాకృతులను వివిధ దేశాధినేతలకు బహుకరించానని మోదీ తెలిపారు. కరీంనగర్‌లో ప్రసిద్ధి చెందిన సిల్వర్‌తో తయారైన బుద్ధుడి ప్రతిమను జపాన్ ప్రధానికి బహుకరించానన్నారు. అలాగే కరీంనగర్‌లో రూపుదిద్దుకున్న పూల ఆకృతితో ఉన్న సిల్వర్ మిర్రర్‌ను.. ఇటలీ ప్రధానికి బహుకరించానని ప్రధాని మన్ కీ బాత్‌లో తెలిపారు.