మహేశ్-రాజమౌళి మూవీకి టైటిల్ మార్పు?
NEWS Nov 30,2025 01:50 pm
మహేశ్ బాబు - రాజమౌళి కాంబినేషన్ మూవీకి ‘వారణాసి’ అనే పేరును ఖరారు చేయగా, తెలుగులో పేరు మార్చనున్నట్లు తెలుస్తోంది. ‘వారణాసి’ అనే టైటిల్‌ను ఇప్పటికే రామభక్త హనుమా క్రియేషన్స్ బ్యానర్ వాళ్లు రిజిస్టర్ చేయించారు. దీంతో రాజమౌళి సినిమాకు తెలుగులో ఇదే టైటిల్ వాడటంపై సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్‌కు 'రాజమౌళి వారణాసి' అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట. ఇతర భాషల్లో మాత్రం ‘వారణాసి’ పేరుతోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.