iBOMMA రవి కొత్త ప్లాన్స్ ఇవే..
NEWS Nov 30,2025 01:37 pm
TG: పైరసీ వ్యవహారాన్ని తన అసలైన గుర్తింపునకు దూరంగా ఉంచాలని iBOMMA రవి ముందుగానే నిర్ణయించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ‘పక్కా ప్రణాళికతోనే రవి ప్రహ్లాద్ పేరుతో పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సుతో పాటు పలు ఫేక్ కంపెనీలను ఓపెన్ చేశాడు. అదే పేరుతోనే 20 సర్వర్లు, 35 డొమైన్లను కొన్నాడు. అలాగే ఫిలిం ఛాంబర్, పోలీసులకు గతంలో పంపిన బెదిరింపు మెయిల్స్‌నూ గుర్తించాం’ అని పోలీసు వర్గాలు వెల్లడించాయి.