వారంలో 4 వేల వరకు పెరిగిన గోల్డ్ ధర
NEWS Nov 30,2025 01:50 pm
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రేట్ రూ.1,29,820, 22 క్యారెట్ల ధర రూ.1,19,000గా ఉంది. కేజీ వెండి ధర రూ.1,92,000 పలుకుతోంది. కాగా ఈ వారంలో(నవంబర్ 23-29) 24 క్యారెట్ల బంగారం ధర రూ.3,980 పెరిగింది. కేజీ సిల్వర్ రేటు వారంలో ఏకంగా రూ.21వేలు పెరగడం గమనార్హం.