సర్పంచ్‌గా తిరుపతి నాయక్ ఏకగ్రీవం
NEWS Nov 30,2025 01:01 pm
కథలాపూర్: రాజారం తాండ సర్పంచ్‌గా తిరుపతి నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో సర్పంచ్ పదవికి ఒక్క నామినేషన్, 4 వార్డులకు 4 నామినేషన్లు మాత్రమే రావడంతో అధికారులు ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ సందర్భంగా తిరుపతి నాయక్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తానని, ప్రతి పనిని వార్డుల సభ్యులతో కలిసి పారదర్శకంగా చేపడతానని హామీ ఇచ్చారు.