సర్పంచ్ ఎన్నికల కోసం ఎస్ఐ రాజీనామా
NEWS Nov 29,2025 10:35 pm
కోదాడ: సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కోదాడ టౌన్ ఎస్ఐ పులి వెంకటేశ్వర్లు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. గుడిబండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఇంకా 5 నెలల సేవ మిగిలి ఉన్నప్పటికీ వీఆర్ఎస్ తీసుకున్నట్లు తెలిపారు. పుట్టిన ఊరికి సేవ చేయడం తన లక్ష్యమని చెప్పారు. మేజర్ పంచాయతీ అయిన గుడిబండలో జనాభా 4,486, ఓటర్లు 3,813, వార్డులు 12. ఆదివారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.