మహిళా సంఘాల సమావేశ మందిరం ప్రారంభం
NEWS Nov 29,2025 10:23 pm
రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని జీవీఎంసీ 18వ వార్డ్ కార్పొరేటర్ గొలగాని మంగవేణి పోలారావు తెలిపారు. 18వ వార్డ్ ఎంవీపీ కాలనీ సెక్టర్–9 గొల్లవీధిలో మహిళా సంఘాల కోసం రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన సమావేశ మందిరాన్ని ఆమె ప్రారంభించారు. మహిళా సంఘాలు, డ్వాక్రా గ్రూపులు తమ సమావేశాలు, కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ఈ భవనం ఉపయోగపడుతుందన్నారు. మహిళల అభివృద్ధికి ఇలాంటి సదుపాయాలు మరింత తోడ్పడతాయని కార్పొరేటర్ పేర్కొన్నారు.