ఘనంగా న్యూహోప్ ఫౌండేషన్ వేడుక
NEWS Nov 29,2025 10:13 pm
విశాఖపట్నంలో న్యూహోప్ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళ, సాహిత్యం, జర్నలిజం, సేవారంగాల్లో విశేష సేవలు అందించిన పలువురిని ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డా. నాగమల్లేశ్వరి సత్కరించారు. కార్యక్రమానికి వైసీపీ జిల్లా అధ్యక్షులు కెకె రాజు, వైద్యులు కోటేశ్వర ప్రసాద్, బీసీ జేఏసీ నార్త్ ఆంధ్ర కో-ఆర్డినేటర్ నరేంద్ర యాదవ్, సురేంద్రనాధ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏటా సేవాపరుల్ని గుర్తించి సత్కరించడం ఫౌండేషన్ ప్రత్యేకతగా అతిథులు అభినందించారు.