డా.సునీతకి ఆల్టర్నేటివ్ మెడిసిన్‌లో డాక్టరేట్
NEWS Nov 29,2025 04:58 pm
మానవాళికి సురక్షితంగా భావించే ఆల్ట్రనేటివ్ మెడిసిన్ రంగంలో చేసిన విశేష పరిశోధనలకు గాను డాక్టర్ సునీత సారికి నార్త్ అమెరికాలోని ప్రతిష్టాత్మక మెడిసినా ఆల్టర్నేటివా అజ్టెకా యూనివర్సిటీ అత్యున్నత డాక్టరేట్ పట్టాను ప్రదానం చేసింది. బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్న రోగులకు ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ ద్వారా సురక్షితమైన, ప్రభావవంతమైన చికిత్సలపై ఆమె చేసిన పరిశోధనలు విశ్వవిద్యాలయాన్ని ఆకట్టుకున్నాయి. ఆధునిక కాలంలో పెరుగుతున్న ప్రమాదకర వ్యాధుల చికిత్సలో ఉపయోగించే కొన్ని ఆధునిక ఔషధాలు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తున్నప్పటికీ, దుష్ప్రభావాలను కూడా మిగులుస్తున్నాయని డాక్టర్ సునీత పేర్కొన్నారు. మానవాళికి హాని చేయని, పర్యాయం చికిత్స విధానాలపై మరింత పరిశోధనలు కొనసాగిస్తానని డాక్టర్ సునీత సారి తెలిపారు.