మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్ పూర్తి షెడ్యూల్‌ను BCCI విడుదల చేసింది. ఈ టోర్నీ జనవరి 9న ప్రారంభం కానుండగా, తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, 2024 విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఈ ఆరంభ మ్యాచ్‌కు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదిక. జనవరి 9 నుంచి 17 వరకు నవీ ముంబైలో తొలి 11 మ్యాచ్‌లు జరుగుతాయి. మిగిలిన 11 మ్యాచ్‌లకు వడోదరలోని కోటంబి స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది. ఫిబ్రవరి 5న ఫైనల్ మ్యాచ్.