రికార్డు స్థాయిలో బంగారం, వెండి ధరలు
NEWS Nov 29,2025 12:20 pm
బంగారం, వెండి ధరలు పగ్గాలు లేకుండా పెరిగిపోతున్నాయి. ఈరోజు పసిడి, వెండి ధరలు ఊహించని రీతిలో పెరిగిపోయి ఆల్-టైమ్ గరిష్ఠాలకు చేరువయ్యాయి. హైదరాబాద్ మార్కెట్‌లో ఈ ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,360 పెరిగింది. దీంతో దాని ధర రూ.1,29,820కి చేరింది. అదేవిధంగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,250 పెరిగి, దాని తుది ధర రూ.1,19,000గా నమోదైంది.