కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వద్ద కొటేకల్ గ్రామ సమీపంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో చిన్నారులతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. మృతులంతా కర్ణాటకకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.