సర్పంచ్‌ను చేయండి.. NRI వరాల జల్లు
NEWS Nov 29,2025 10:11 am
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి (మం) మోటాపురంకి చెందిన NRI రావెళ్ల కృష్ణారావు సర్పంచ్ అభ్యర్థిగా ఆకర్షణీయ హామీలతో మ్యానిఫెస్టో చేశారు. తనను గెలిపిస్తే ఏటా ₹ 35 లక్షలు స్వంత ఖర్చుతో గ్రామాభివృద్ధి కోసం వీరన్నస్వామి ఆలయానికి ₹ 50 లక్షల విలువైన భూమి విరాళం, ఇంటి పన్నులు, నల్లా బిల్లుల చెల్లింపు, లైబ్రరీ, ఆర్వో ప్లాంట్, వైద్యశిబిరాలు, వివాహాలకు సాయం, దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, ఆలయాలు, చర్చిలకు విరాళాలు వంటి హామీలతో మ్యానిఫెస్టో వైరల్‌గా మారింది.