కేసీఆర్ ఆమరణ దీక్షకు 16 ఏండ్లు
NEWS Nov 29,2025 09:48 am
తెలంగాణ సాధనలో ఓ ఘట్టం దీక్షా దివస్. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’, ‘కేసీఆర్ శవయాత్రో.. తెలంగాణ జైత్రయాత్రో’ అని ప్రకటించి ఆమరణ నిరాహారదీక్ష కోసం సిద్దిపేటకు బయలుదేరి సరిగ్గా నేటికి 16 ఏండ్లు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు 11 రోజులపాటు సాగింది. 2009 నవంబర్ 29న కరీంనగర్ నుంచి ఖమ్మం దాకా నరాలు ఉత్కంఠ మధ్య సాగిన ప్రయాణం, రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిన నిరసన జ్వాలలు, ఎల్బీనగర్‌లో శ్రీకాంతాచారి ఆత్మార్పణంతో తెలంగాణ అగ్నిగుండంగా మారడం.. ప్రతి ఘట్టం తెలంగాణ స్ఫూర్తిని చాటేదే.