ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధాని మోదీ దక్షిణ గోవాలో ఆవిష్కరించారు. పార్తగాలిలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠంలో ఏర్పాటు చేసిన 77 అడుగుల ఈ భారీ కంచు విగ్రహాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. గుజరాత్‌లోని ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ రూపశిల్పి రామ్ సుతార్ ఈ శ్రీరాముడి విగ్రహాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు.