నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘అఖండ 2’ డిసెంబరు 5న విడుదల కానున్న నేపథ్యంలో.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర బృందం శుక్రవారం నిర్వహించింది. కైతలాపూర్ గ్రౌండ్స్ (కూకట్‌పల్లి) వేదికగా ఏర్పాటైన ఈ వేడుకకు అభిమానులు తరలివచ్చారు. బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి తెరకెక్కించిన హిట్ మూవీ ‘అఖండ’కు సీక్వెల్‌గా రూపొందింది ‘అఖండ 2’. ఇందులో సంయుక్త హీరోయిన్ కాగా ఆది పినిశెట్టి విలన్‌గా నటించారు.