కేసు విచారణలో కెమెరా దొంగలు పట్టుబడ్డారు
NEWS Nov 29,2025 01:18 pm
ఎంవిపి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మద్దిలపాలెం కాకతీయ ఫంక్షన్ హాల్‌లో 22న వివాహ వేడుకలో ఫోటోగ్రాఫర్ మహమ్మద్ ఇషాక్‌కు చెందిన రూ.1.50 లక్షల విలువైన కెమెరా చోరీకి గురైంది. ఈ మేరకు ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి, 27న ఇద్దరు మైనర్ బాలురను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కెమెరా దొంగతనాన్ని వారు అంగీకరించడంతో, పోలీసులిచ్చిన సూచనల మేరకు వారిని జువెనైల్ హోంకు తరలించారు.