ఎన్నికలను రద్దు చేయాలి: ఆర్.కృష్ణయ్య
NEWS Nov 28,2025 05:04 pm
TG: స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలని BC నేత, రాజ్యసభ MP ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. HYD గన్ పార్క్ వద్ద BC సంఘాలతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను రద్దు చేసి జీవో9ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేదంటే బీసీల తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. BCలకు 42% రిజర్వేషన్లు కేటాయించకపోవడంపై బీసీ సంఘాలు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే.