ఆసియాలో పెరిగిన భారత్ పలుకుబడి
NEWS Nov 28,2025 01:27 pm
ఆసియాలో అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో భారత్ 3వ స్థానానికి చేరుకుంది. 'లోవీ ఇన్‌స్టిట్యూట్' విడుదల చేసిన 'ఆసియా పవర్ ఇండెక్స్ 2025' లిస్టులో అమెరికా అగ్రస్థానంలో నిలవగా, చైనా 2వ స్థానంలో ఉంది. ఆసియాలోని 27 దేశాల్లో సైనిక సామర్థ్యం, ఆర్థిక సంబంధాలు, దౌత్యపరమైన పలుకుబడి, సాంస్కృతిక ప్రభావం వంటి 8 అంశాల పరిధిలోని 131 సూచికల ఆధారంగా ఈ ర్యాంకింగ్‌లను కేటాయించారు. ఈ ఏడాది భారత్ 40 పాయింట్ల స్కోరుతో తన ర్యాంకును పదిలం చేసుకోవడమే కాకుండా, తొలిసారిగా 'మేజర్ పవర్' హోదాను అందుకుంది.