అమరావతి: రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. 34 వేల ఎకరాలు ఇచ్చిన అన్నదాతలకు ధన్యవాదాలు తెలిపారు. బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం అనంతరం మాట్లాడారు. ‘‘ప్రధాని మోదీ వచ్చి రాజధాని పనులకు పునఃప్రారంభం చేశారు. 2028 మార్చి నాటికి పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయి. అందుకు నిర్మలా సీతారామన్ రూ.15వేల కోట్లు అమరావతికి నిధులిచ్చారు’’ అని తెలిపారు.