మహాత్మ జ్యోతిరావు పూలేకు ఘన నివాళి
NEWS Nov 28,2025 07:28 am
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రాణం పెట్టి పోరాడిన మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా 29వ వార్డు పరిధిలోని గ్రీన్ పార్క్ రోడ్‌లో ఉన్న పూలే విగ్రహానికి 29వ వార్డు టీడీపీ అధ్యక్షుడు ఉరుకుటి గణేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. వార్డు టీడీపీ అధ్యక్షుడు గణేష్, "జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి" అని పూలే సిద్ధాంతాలను స్మరించుకున్నారు. 29వ వార్డు టీడీపీ జనరల్ సెక్రటరీ రాయన బంగారురాజు, పోలి పిల్లి కృష్ణ, కొండ్రు శ్రీను తదితరులు పాల్గొన్నారు.