బలహీనవర్గాల్లో వెలుగులు నింపిన ఫూలే
NEWS Nov 28,2025 11:38 am
బహుజనలకు విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు జ్యోతిబా ఫూలే వర్థంతి నేడు. 1827 ఏప్రిల్ 11న ప్రస్తుత పశ్చిమ మహారాష్ట్రలో జన్మించారు. అణచివేతకు గురైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి తన జీవితాన్ని అంకితం చేశారు. వారికి సాధికారత కల్పించడంలో ఎంతో కృషిచేసిన సామాజిక సంస్కర్త, విద్యావేత్త ఫూలే. ఆది నుంచీ కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూనే, మహిళ విద్య కోసం ఎనలేని కృషి చేశారు.