HYD: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన G.O 46పై అభ్యంతరంపై వ్యక్తం చేస్తూ గురువారం వెనుకబడిన కుల సంఘాలు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాయి. అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కేటాయించాలని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. బీసీలలో ఏబీసీడీ వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. ఈక్రమంలో విచారణ చేపట్టిన హైకోర్టు.. ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ దశలో స్టే విధించలేమంది.