శబరిమలలో ఆంధ్ర భక్తులపై వివక్ష
NEWS Nov 28,2025 10:59 am
శబరిమల: ఆలయ అధికారులు, పోలీసులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తుల పట్ల వివక్ష చూపుతున్నారన్న ఆరోపణలు వెలువడ్డాయి. సాక్షుల ప్రకారం.. కేరళకు చెందిన భక్తులకు ప్రవేశానుమతి ఇవ్వగా, ఆంధ్ర భక్తులను మాత్రం గేట్లు మూసివేసి ఆలస్యానికి గురిచేశారు. ప్రశ్నించిన భక్తులతో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు “ఇది మా రాష్ట్రం… మా మాటే శాసనం” అంటూ దురుసుగా వ్యవహరించినట్లు సమాచారం. పోలీసుల వైఖరిపై ఆందోళనకు గురైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటి వివక్షతా ఘటనలు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.