డిసెంబర్ 3న TUWJ ‘మహా ధర్నా’
NEWS Nov 28,2025 12:18 am
హైదరాబాద్: జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 3న ‘మహా ధర్నా’ నిర్వహించనున్నట్లు TUWJ ప్రకటించింది. మాసాబ్ ట్యాంక్ సమాచార శాఖ కమిషనర్ ఆఫీస్ వద్ద ఈ నిరసన జరగనుంది. కొత్త అక్రిడిటేషన్ పాలసీ ప్రకటించి కార్డులు జారీ చేయడం, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాల మంజూరులో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని యూనియన్ నేతలు విరాహత్ అలీ, రాంనారాయణ ఆరోపించారు. మంత్రికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ ధర్నా చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.