పాకిస్తానీలకు వీసాలు ఆపేసిన దుబాయ్
NEWS Nov 27,2025 11:47 pm
దుబాయ్: పాకిస్థాన్ పౌరులకు UAE వీసాలను నిలిపివేసినట్లు తెలిసింది. UAEకి వచ్చిన తర్వాత అనేక మంది పాకిస్థానీయులు భిక్షాటన, నేర కార్యకలాపాల్లో పాల్గొంటున్నారనే ఆందోళనల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. టూరిజం వీసాపై UAE వచ్చే అనేక మంది పాకిస్థానీయులు భిక్షాటన చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం గుర్తించింది. ఇలా వచ్చిన వేలాది మంది పాక్ బిచ్చగాళ్లను వారి స్వదేశానికి పంపించింది. నేరాలకు పాల్పడుతున్నట్లు గ్రహించిన UAE వీసాలను నియంత్రిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బ్లూ, డిప్లొమాటిక్ పాస్‌పోర్టుదారులకు మాత్రమే వీసాలు ఇస్తున్నట్లు తెలిసింది.