హరిణ్యను పెళ్లాడిన రాహుల్ సిప్లిగంజ్
NEWS Nov 27,2025 12:47 pm
స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు హరిణ్య రెడ్డితో కలిసి ఏడడుగులు వేశాడు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు పలువురు ప్రముఖులు, ఇరు కుటుంబాల బంధువులు హాజరయ్యారు. ఏపీకి చెందిన టీడీపీ నేత, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కూతురే హరిణ్య రెడ్డి. ఎన్నో పాపులర్ పాటలు పాడిన రాహుల్ ‘నాటు నాటు’ సాంగ్‌తో ఆస్కార్ స్థాయికి ఎదిగాడు.