ఆధార్ ఉంటే దేశ పౌరసత్వం ఉన్నట్టు కాదు
NEWS Nov 27,2025 12:37 pm
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి కూడా ఆధార్ కార్డులు అందుతున్నాయని, అలాంటప్పుడు ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన వారికి ఓటు హక్కు కూడా కల్పించాలా? అని సుప్రీంకోర్టు కీలక ప్రశ్న లేవనెత్తింది. ఆధార్ కార్డు కేవలం సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరవేయడానికి మాత్రమేనని, దానిని పౌరసత్వానికి లేదా ఓటు హక్కుకు రుజువుగా పరిగణించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. "పొరుగు దేశం నుంచి వచ్చిన ఓ కూలీకి రేషన్ కోసం ఆధార్ కార్డు ఇస్తే, అతడిని ఓటరుగా కూడా చేయాలా?" అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.