ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకున్న ప్రేమకథ ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాను ఉచితంగా చూసే అవకాశాన్ని చిత్రబృందం కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ఫేమస్ థియేటర్‌లలో ఈ చిత్రాన్ని ఉచితంగా చూడొచ్చని తెలిపారు. మహిళలకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలుపుతూ పోస్ట్ పెట్టారు. ఈరోజు వరకూ ఈ ఆఫర్ ఉంటుందన్నారు. థియేటర్ దగ్గరకు వెళ్లి టికెట్లు ఉచితంగా తీసుకోవాలని కోరారు.