ప్రారంభమైన మార్గశిర మహోత్సవాలు
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
NEWS Nov 27,2025 11:28 am
విశాఖపట్నం పాతనగర ప్రాంతంలో గురువారం ఉదయం శ్రీ మార్గశిర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి మార్గశిర గురువారం సందర్భంగా వేకువ జాము నుంచే అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ దంపతులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మార్గశిర మాసం ప్రతి గురువారం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.