డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
NEWS Nov 27,2025 11:26 am
విశాఖపట్నంలో గురువారం ఉదయం ట్రాఫిక్, రవాణా, అగ్నిమాపక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శివ శివాని పబ్లిక్ స్కూల్ (కారాస) వద్ద బస్సు, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అధికారులు ముందుగా స్కూల్ బస్సులు, ఆటోలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, డ్రైవర్లకు రోడ్డు భద్రతకు సంబంధించిన ముఖ్య సూచనలు అందించారు. వాహనాలు నడుపుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, బస్సులు, ఆటోల్లో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు అనుసరించాల్సిన భద్రతా చర్యలపై ప్రదర్శనతో పాటు పలు మార్గదర్శకాలు కూడా తెలిపారు. అధికారులు విద్యార్థుల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని డ్రైవర్లను ఆదేశించారు.