రోహిత్ శర్మ మళ్లీ వన్డే No.1 బ్యాట్స్‌మన్
NEWS Nov 26,2025 11:13 pm
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు రాడిల్ మిచెల్ రేటింగ్ పాయింట్లు తగ్గడంతో రోహిత్ నెంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. శుభ్‌మన్ గిల్ నాలుగో, విరాట్ కోహ్లీ ఐదో స్థానాల్లో నిలిచారు. శ్రేయాస్ అయ్యర్ తొమ్మిదో స్థానానికి జారిపోయాడు. ఇతర జట్ల ఆటగాళ్లు కూడా ర్యాంకుల్లో మార్పులు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా, రాబోయే టీ20 ప్రపంచకప్–2026కి ఐసీసీ రోహిత్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది.