పెందుర్తిలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
NEWS Nov 26,2025 11:19 pm
పెందుర్తి నియోజకవర్గంలోని సబ్బవరం మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా కలిసి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థుల ఉత్సాహాన్ని పెంపొందించేందుకు బాలబాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.