ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
NEWS Nov 26,2025 11:14 pm
ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖపట్నం పోర్ట్ పూల్ కళాశాల గౌరవాధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో 77వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జ్ఞానాపురం ప్రాంతంలో పోర్టు వారు నిర్మించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారీ విగ్రహానికి నిరుద్యోగ యువత, విద్యార్థులు, పోర్ట్ కార్మిక సంఘ నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు. “జోహార్ అంబేద్కర్” నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. హేమంత్ మాట్లాడుతూ, బ్రిటిష్ పాలనా కాలంలోనే లా కమిషన్ చైర్మన్‌గా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను బ్రిటిష్ ప్రభుత్వం నియమించిందని, ఆయన దేశానికి చేసిన సేవలు అమూల్యమని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు.