వైసిపిలోకి క్రిస్టియన్ మైనార్టీ నేత సొండి సుధాకర్
NEWS Nov 26,2025 11:19 pm
క్రిస్టియన్ మైనార్టీ విభాగానికి చెందిన సొండి సుధాకర్ బాబు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. 32వ వార్డు అధ్యక్షుడు రాజారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వంలో క్రిస్టియన్ మైనార్టీలపై జరుగుతున్న అన్యాయాలపై నిరాశతో వైసీపీలో చేరుతున్నానని సుధాకర్ బాబు తెలిపారు. వైసీపీ హయాంలో మైనార్టీలకు గౌరవ స్థానం లభించిందని పేర్కొన్నారు.