రహదారి అభివృద్ధి ప్రాజెక్టుకు ఆమోదం
NEWS Nov 26,2025 11:21 pm
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (GVMC) పరిధిలో మొత్తం 88.35 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి, నిర్వహణ కోసం ‘వార్షిక చెల్లింపు నమూనా’ (Annual Payment Model) అమలు చేయడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపిందని కమిషనర్ కేతన్ గార్గ్ బుధవారం ప్రకటించారు. సుమారు రూ.307 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా రహదారుల నాణ్యతను దీర్ఘకాలం నిలబెట్టేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ విధానం అమల్లోకి వస్తే రహదారుల మరమ్మతులు, నిర్వహణ మరింత వేగంగా, పారదర్శకంగా సాగుతాయని కమిషనర్ పేర్కొన్నారు.