బాల్యం కేంద్రాలకు సాయానికి కమిషనర్ విజ్ఞప్తి
NEWS Nov 26,2025 11:17 pm
బాల్యం విద్యా కేంద్రాల అభివృద్ధికి దాతలు మరింతగా తోడ్పాటు అందించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. జీవీఎంసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దాతలు అందించిన యూనిఫాంలు, షూస్, సాక్స్, బెల్టులు బాల్యం విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, స్వచ్చ అంబాసిడర్ చైతన్య పాల్గొన్నారు. కమిషనర్ మాట్లాడుతూ పిల్లల విద్య, బలహీన వర్గాల అభ్యున్నతికి ఇలాంటి సహకారం అవసరమని అన్నారు.