సుబ్రహ్మణ్య స్వామి వారి షష్టి కళ్యాణ
మహోత్సవాల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ
NEWS Nov 26,2025 11:15 pm
విశాఖ 29వ వార్డు చందక వీధిలోని శ్రీ శిరిడీ సాయిబాబా మందిరం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి షష్టి మహోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఉరికిటి రామకృష్ణ సమన్వయంతో జరిగిన ఈ వేడుకల్లో కల్యాణ మహోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని అన్నసమారాధనలో పాల్గొన్నారు. టిడిపి వార్డు అధ్యక్షుడు ఊరికిటి గణేష్, మహిళలు, భక్తులు భారీగా పాల్గొన్నారు.