90 ఏళ్ల సలీం ఖాన్ ఫిట్‌నెస్ సీక్రెట్
NEWS Nov 26,2025 02:27 pm
సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ 90 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఆధునిక డైట్‌లు కాదు.. దశాబ్దాలుగా పాటిస్తున్న సాధారణ జీవనశైలే. రోజుకు 2 సార్లు 2-3 పరాఠాలు, అన్నం, మాంసం, చివరగా డెజర్ట్‌తో సంపూర్ణ భోజనం చేస్తారు. నిత్యం బాండ్‌స్టాండ్‌లో వాకింగ్ ఆయన దినచర్య. ఎలాంటి జిమ్ వ్యాయామాలు లేకుండానే ఆరోగ్యంగా ఉంటారు. తన బాడీ కోసం కఠినమైన డైట్ ఫాలో అయ్యే సల్మాన్ జీవనశైలికి భిన్నంగా సలీం ఖాన్ జీవనం సాగిస్తున్నారు.