దేశంలో అతిపెద్ద నగరంగా హైదరాబాద్!
NEWS Nov 26,2025 02:18 pm
హైదరాబాద్ మహానగరాన్ని మరింత విస్తృత పరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. GHMCలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను విలీనం చేయాలని నిర్ణయించింది. ORR వరకు, అవతలి వైపు ఆనుకుని ఉన్న కొన్ని ప్రాంతాలనూ గ్రేటర్‌గా పరిగణించనుంది. 1, 2 నెలల్లో డివిజన్లు, కార్పొరేషన్ల విభజన పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. దీంతో 2,735 చదరపు కి.మీతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించనుంది.