టీమిండియా ఓటమి.. అతిపెద్ద చెత్త రికార్డు
NEWS Nov 26,2025 01:59 pm
గౌహతి: రెండో టెస్టులో సౌతాఫ్రికాపై టీమిండియా 408 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. సొంతగడ్డపై భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే అతి పెద్ద ఓటమి. నిన్నటివరకు టెస్ట్ క్రికెట్‌లో టీమిండియాకు అతి పెద్ద ఓటమి 342 పరుగులతో ఓడిపోవడం. 2004లో నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియా విధించిన 543 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేస్తున్నపుడు ఇండియా 200 పరుగులకే ఆలౌటై, 342 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. తాజాగా సౌతాఫ్రికాతో రెండో టెస్టులో ఇండియా 408 పరుగులతో ఓడిపోయి ఈ చెత్త రికార్డును బ్రేక్ చేసింది.