ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం
NEWS Nov 26,2025 01:50 pm
హైదరాబాద్: ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు స్పీకర్ చాంబర్ లో స్పీకర్ గడ్డం ప్రసాద్ నవీన్ యాదవ్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు, అజారుద్దీన్ , డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.