NBK 111: యోధుడిగా బాలయ్య..
NEWS Nov 26,2025 11:39 am
HYD: ఒకవైపు అఖండ 2 సినిమాతో రాబోతున్న బాలకృష్ణ NBK 111 అనే వర్కింగ్ టైటిల్‌తో దర్శకుడు గొపిచంద్ మలినేనితో సినిమా చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం సందర్భంగా రామానాయుడు స్టూడియోస్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమైంది. దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత కేఎస్ రామారావు, దర్శకుడు బుచ్చిబాబు, దర్శకుడు బాబి కొల్లి తదితరులు పాల్గొన్నారు.