కెప్టెన్ దీపిక: ఆకలి బాధలు.. అవమానాలు..
NEWS Nov 26,2025 11:26 am
తాజాగా భారత అంధ మహిళల జట్టు టీ20 ప్రపంచకప్ విజేతలైన విషయం తెలిసిందే. ఈ జట్టు కెప్టెన్ దీపిక ఏపీలోని సత్యసాయి జిల్లా తంబాలహళ్లికి చెందిన చిక్కతిమ్మప్ప, చిత్తమ్మల కుమార్తె. 5 నెలల వయసులో కంటి చూపు దెబ్బతిన్నా, ఆమె ఆత్మవిశ్వాసం చెక్కు చెదరలేదు. ఒక పూట అన్నం కూడా దొరకని రోజులను, అవమానాలను ఎదుర్కొంది. 8వతరగతిలో క్రికెట్లో అడుగుపెట్టి రాష్ట్ర స్థాయి పోటీల్లో సెంచరీ చేశారు. 2019లో జాతీయ అంధుల మహిళల జట్టు ప్రారంభమవ్వగా అప్పుడే కర్ణాటక జట్టు కెప్టెన్‌గా ఎంపికైంది. ఆపై భారత జట్టులో చోటు సంపాదించింది.